పెట్రోల్‌ ధర రూ.10, డీజిల్‌ ధర రూ.12.50 పెరిగిందా? | Government denies viral claim of fuel price hike, term it as fake | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ధర రూ.10, డీజిల్‌ ధర రూ.12.50 పెరిగిందా?

Apr 29 2026 4:13 PM | Updated on Apr 29 2026 4:25 PM

Government denies viral claim of fuel price hike, term it as fake

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిందనే కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ కథనాల్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. దేశంలో ఇంధన ధరలు పెరగలేదని, స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పెట్రోల్ ధరలను రూ.10, డీజిల్ ధరలను రూ.12.50 పెంచినట్లు సోషల్‌ మీడియా పోస్టులు వైరల్‌గా మారాయి.  ఇంధన ధరల పెంపుపై వస్తున్న వదంతులను భారత ప్రభుత్వం బుధవారం ఖండించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన అధికారిక ఉత్తర్వు అంటూ ప్రచారంలో ఉన్న ఓ పత్రాన్ని ట్వీట్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్‌ చేసింది. ఆ పత్రం ‘నకిలీ’దని ప్రకటించింది. వదంతులను నమ్మొద్దని కోరింది.  

ఇంధన ధరలు పెరిగాయంటూ సర్క్యూలేట్‌ అవుతున్న పత్రాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చెక్‌ చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చింది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదు’అని పేర్కొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement