గ్యాస్‌ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేటీఆర్‌ | KTR Fires On Central Government Over Gas Shortage, Demands Immediate Measures To Ease Public Hardship | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేటీఆర్‌

Mar 24 2026 10:32 AM | Updated on Mar 24 2026 12:01 PM

KTR fires on Central Government Over Gas Shortage

సాక్షి, హైదరాబాద్‌: యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్‌పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ నేతలు.. గన్‌పార్క్ దగ్గర భారీ నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోందని.. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉందని మండిపడ్డారు.

‘‘కేంద్రం అధీనంలో పెట్రోలియం శాఖ ఉందని.. తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఫ్యూచర్‌లో గ్యాస్‌ సిలిండర్‌ సైజ్‌ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయి. 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను 10 కిలోలకు తగ్గిస్తారంట. సామాన్య ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆంబోతు కొట్లాటలో లేగలు బలైనట్లు సామాన్యుల పరిస్థితి. యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత చర్చనీయాంశంగా మారింది. కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం ప్రజలను మభ్యపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. గ్యాస్ కొరత పై ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రకటన చేయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement