టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు | Telegram temporarily banned in India till June 22 ahead of NEET re-exam | Sakshi
Sakshi News home page

టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు

Jun 17 2026 5:34 AM | Updated on Jun 17 2026 5:33 AM

Telegram temporarily banned in India till June 22 ahead of NEET re-exam

21న నీట్‌ రీ–ఎగ్జామ్‌ నేపథ్యంలో కేంద్రం చర్యలు 

సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్‌ యూజీ– 2026 రీ–ఎగ్జామ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్‌ లీకేజీ కుట్రలను, తప్పుడుసమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌పై జూన్‌ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ), కేంద్ర విద్యా శాఖ చేసిన సిఫార్సుల మేరకు ఎల ్రక్టానిక్స్, ఐటీ శాఖ ఈ మేర కు చర్యలను ప్రకటించింది. ఐటీ చట్టం –2000 లోని సెక్షన్‌ 69ఏ కింద టెలిగ్రామ్‌ యాక్సెస్‌పై పరిమిత కాలం పాటు ఈ ఆంక్షలు అమలవుతాయి. 

ఈనెల 21న నీట్‌ రీ–ఎగ్జామ్‌ జరగనున్న నేపథ్యంలో, పరీక్ష మరుసటి రోజు జూన్‌ 22 వరకు ఇవి అమల్లో ఉంటాయి. అలాగే, అప్పటికే పోస్ట్‌ చేసిన మెసేజ్‌లను ఎడిట్‌ చేసుకునే సదుపాయాన్ని సైతం జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష పూర్తయిన తర్వాత తప్పుడు ఆధారాలతో పేపర్‌ లీకైనట్లు వచ్చే పుకార్లకు చెక్‌ పెట్టేందుకే ఈ ఫీచర్‌ను డిసేబుల్‌ చేసినట్లు ఎన్‌టీఏ చీఫ్‌ అభిషేక్‌ సింగ్‌ తెలిపారు.పేపర్‌ లీక్‌ అయ్యిందంటూ వస్తున్న వార్తల కారణంగా ఈ చర్య తీసుకోలేదని, ఆన్‌లైన్‌లో వస్తున్న నకిలీ మెసేజీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్‌టీఏ చీఫ్‌ అభిషేక్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement