breaking news
Temporary ban
-
టెలిగ్రామ్‌పై నిషేధం సబబే
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ రీ–ఎగ్జామ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పేపర్ లీకేజీలను నివారించేందుకు జూన్ 22 వరకు యాప్‌ను బ్యాన్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్‌లోని సాంకేతిక ఫీచర్ల ద్వారా ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను సష్టించి, ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఒక బాట్‌ను బ్లాక్ చేస్తే, దానంతటదే మరో బాట్‌కు సమాచారం బదిలీ అయ్యే (మిర్రర్ ఛానల్) వ్యవస్థ ఇందులో ఉందని వివరించారు. 21న జరిగే నీట్ రీ–ఎగ్జామినేషన్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకే తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు వివరించారు. అయితే, నీట్‌కు సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్న 900 పైగా లింకులను ఏఐ సాంకేతికత ద్వారా ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్ వాదించింది. కొందరు చేసిన తప్పులకు 15 కోట్లకు పైగా ఉన్న సాధారణ యూజర్లను శిక్షించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొంది. కేవలం ఒక వర్గానికి చెందిన అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో, ఏ సంబంధం లేని 15 కోట్ల మంది సాధారణ యూజర్ల యాప్ వినియోగాన్ని ఎలా నిరోధిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రాన్ని మౌఖికంగా ప్రశ్నించింది. వాదనల అనంతరం టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ తేజస్ కరియా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఒక సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్ చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. జరగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టెలిగ్రామ్ యాప్ తాత్కాలిక నిషేధంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని కోర్టు సమర్థిస్తూ.. ఆ నిర్ణయం సరైన కారణాలతో తీసుకున్నదేనని శుక్రవారం స్పష్టం చేసింది.జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ పరీక్ష నేపథ్యంలో, ప్రశ్నాపత్రాలు లీక్ కావడం లేదా దుర్వినియోగం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న చర్యగా దీన్ని సమర్థించింది.కోర్టు వ్యాఖ్యానిస్తూ, ప్రభుత్వానికి సరైన కారణాలు ఉన్నాయని, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం విధించిన విధానాన్ని పూర్తిగా పాటించారని పేర్కొంది. అందుబాటులో ఉన్న అత్యల్ప పరిమితి చర్య ఇదేనని అభిప్రాయపడింది.కేంద్ర ప్రభుత్వం తన వాదనల్లో టెలిగ్రామ్ ఛానెళ్లు ఉగ్రవాద కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయని తెలిపింది. ఇవి ఒక విధంగా “చీకటి వెబ్” తరహాలో పనిచేస్తూ, నేరగాళ్లను గుర్తించడం కష్టతరం చేస్తున్నాయని కోర్టుకు వివరించింది.మరోవైపు, టెలిగ్రామ్ ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ, ఇది కోట్లాది వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తుందని వాదించింది. పేపర్ లీక్‌లను అడ్డుకోవడానికి యాప్‌ను నిషేధించడం సరైన పరిష్కారం కాదని, ఇతర యాప్‌ల ద్వారానూ ఇలాంటి సమస్యలు జరుగుతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు, ప్రభుత్వ నిర్ణయంలో లోపం లేదని తేల్చింది. నిషేధ ఉత్తర్వులు కారణాలతో కూడుకున్నవని, అవి సరైన పరిశీలనతో తీసుకున్నవేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దేశంలో టెలిగ్రామ్ యాప్‌పై విధించిన తాత్కాలిక నిషేధం నిర్ణయించిన గడువు వరకు కొనసాగనుంది. -
టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ– 2026 రీ–ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కుట్రలను, తప్పుడుసమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ), కేంద్ర విద్యా శాఖ చేసిన సిఫార్సుల మేరకు ఎల ్రక్టానిక్స్, ఐటీ శాఖ ఈ మేర కు చర్యలను ప్రకటించింది. ఐటీ చట్టం –2000 లోని సెక్షన్ 69ఏ కింద టెలిగ్రామ్ యాక్సెస్‌పై పరిమిత కాలం పాటు ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈనెల 21న నీట్ రీ–ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో, పరీక్ష మరుసటి రోజు జూన్ 22 వరకు ఇవి అమల్లో ఉంటాయి. అలాగే, అప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని సైతం జూన్ 30 వరకు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష పూర్తయిన తర్వాత తప్పుడు ఆధారాలతో పేపర్ లీకైనట్లు వచ్చే పుకార్లకు చెక్ పెట్టేందుకే ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసినట్లు ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ తెలిపారు.పేపర్ లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తల కారణంగా ఈ చర్య తీసుకోలేదని, ఆన్లైన్లో వస్తున్న నకిలీ మెసేజీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. -
హిమా దాస్‌పై తాత్కాలిక నిషేధం
భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. గత ఏడాది కాలంలో డోపింగ్ పరీక్షల కోసం ఆమె తన ఆచూకీ వివరాలు ‘నాడా’కు ఇవ్వకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. నిబంధనల ప్రకారం హిమా దాస్ రెండేళ్ల నిషేధం ఎదుర్కోవచ్చు. అస్సాంకు చెందిన 23 ఏళ్ల హిమ 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల విభాగంలో రజతం, మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది. -
వినేశ్ ఫొగాట్ సస్పెండ్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే సంజాయిషీ కోరుతూ ఆమెతో పాటు మరో రెజ్లర్ సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టోక్యో విశ్వక్రీడల్లో వినేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. హంగేరి శిక్షణకు వెళ్లిన ఆమె అక్కడి నుంచే నేరుగా టోక్యోకు వచ్చింది. కానీ భారత జట్టు క్రీడాకారులు బస చేసిన క్రీడా గ్రామంలో ఉండకుండా వెలుపల తన హంగేరి కోచ్, సహాయకులతో బస చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షు భారత్ నుంచి టోక్యోకు రావడంతో వారి నుంచి తనకు కరోనా సోకే ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ వినేశ్ వారితో కలిసి ఉండేందుకు, కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కఠిన చర్యలు చేపట్టింది. ‘ఫొగాట్ తన ప్రవర్తనతో తీవ్రస్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించింది. అందుకే తాత్కాలిక నిషేధం విధించాం. ఇపుడామె ఎలాంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపాం. సంజాయిషీ ఇచ్చేందుకు ఈ నెల 16లోగా గడువిచ్చాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఆపండి..!
- ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా - జన్మభూమి కార్యక్రమాల తరువాత నిర్ణయం - ఇప్పటికే రిలీవ్ అయిన వారికి మినహాయింపు ఏలూరు : ఉద్యోగులు, అధికారుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2నుంచి 20 వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం చేపడుతున్న దృష్ట్యా.. తిరిగి నిర్ణయం తీసుకునే వరకు బదిలీల ప్రక్రియను నిలుపుదల చేయూలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బదిలీ అరుున ఉద్యోగులు, అధికారులకు మాత్రం మినహారుుంపు ఇచ్చారు. మిగిలిన వారిని ఎప్పుడు బదిలీ చేయూలనే విషయంపై అక్టోబర్ 20 తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. బదిలీలపై తాత్కాలిక నిషేధం విధించడంతో అధికారులు వత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పథకాల హడావుడి.. మరోవైపు బదిలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటామా? లేదా ? అన్న ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు నువైన స్థానం కోసం ఎదురుచూస్తున్న వారు వాయిదాను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి అక్టోబర్ 10 నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా అధికారులు, ఉద్యోగుల్ని బదిలీ చేస్తే ఆ కార్యక్రమం కుంటుపడే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్ని జపిస్తోంది. అడుగడుగునా గందరగోళమే బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నాటినుంచీ గందరగోళ పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నారుు. తొలుత సెప్టెంబర్ 10 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయూలని చెప్పిన ప్రభుత్వం తరువాత ఆ గడువును నెల రోజులు పెంచి అక్టోబర్ 10 వరకు అవకాశం ఇచ్చింది. తాజాగా అక్టోబర్ 20వ తర్వాతే బదిలీల ప్రక్రియ జరపాలని ఆదేశించింది. ఇదిలావుండగా జీరో సర్వీస్ పేరిట అన్ని శాఖల్లోను, అన్ని విభాగాల్లోను అధికారులు, సిబ్బందికి స్థానచలనం కల్పించాలని ఆదేశాలిచ్చింది. ఇప్పడేమో కొన్ని శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో 20 శాతం మందిని మించి బదిలీ చేయడకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటివరకు ఎవర్ని.. ఎలా బదిలీ చేయాలన్న అంశం పై మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎంపీడీవోలు, ఇంజినీర్లను జోన్ల వారీగా బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారుు. మరోవైపు అధికారుల బదిలీ విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నతాధికా రులకు తలబొప్పి కట్టిస్తున్నారుు. ఇలాంటి పరిస్థితులు, గందరగోళాల నడుమ బదిలీలు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో అన్న అనుమానాలు ఉద్యోగ వర్గాలను వెంటాడుతున్నాయి.


