
భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. గత ఏడాది కాలంలో డోపింగ్ పరీక్షల కోసం ఆమె తన ఆచూకీ వివరాలు ‘నాడా’కు ఇవ్వకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. నిబంధనల ప్రకారం హిమా దాస్ రెండేళ్ల నిషేధం ఎదుర్కోవచ్చు. అస్సాంకు చెందిన 23 ఏళ్ల హిమ 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల విభాగంలో రజతం, మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది.