మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు కేంద్రం ఆసరా | Government introduces Credit Guarantee Scheme for Microfinance Institutions 2.0 | Sakshi
Sakshi News home page

మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు కేంద్రం ఆసరా

Mar 22 2026 5:39 AM | Updated on Mar 22 2026 5:39 AM

Government introduces Credit Guarantee Scheme for Microfinance Institutions 2.0

రూ. 20 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ స్కీమ్‌

సాక్షి, న్యూఢిల్లీ:  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైక్రోఫైనాన్స్‌ రంగానికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ’క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌ ఫర్‌ మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌–2.0’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంఎఫ్‌ఐలకు సుమారు రూ. 20 వేల కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణాల లభ్యత పెరగనుంది. ఫలితంగా అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 36 లక్షల మంది చిన్న తరహా రుణ గ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నేషనల్‌ క్రెడిట్‌ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎంఎఫ్‌ఐలకు ఇచ్చే రుణాలకు కేంద్రం గ్యారెంటీ కలి్పస్తుంది. సంస్థల పరిమాణాన్ని బట్టి (చిన్న, మధ్య, పెద్ద) ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలకు 70 శాతం నుంచి 80 శాతం వరకు గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది.  

→ సామాన్యులకు వడ్డీ భారం తగ్గించేలా కేంద్రం ఇందులో కీలక నిబంధన చేర్చింది. ఎంఎఫ్‌ఐలు చిన్న తరహా రుణ గ్రహీతలకు ఇచ్చే వడ్డీ రేటును.. గత ఆరు నెలల సగటు వడ్డీ రేటు కంటే కనీసం 1 శాతం తక్కువకు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల పరిధిలోకి వచ్చే చిన్న రుణ గ్రహీతలందరూ దీనికి అర్హులే. మైక్రోఫైనాన్స్‌ రంగం నిధుల లేమితో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. 2026 జూన్‌ 30 వరకు లేదా రూ.20 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ పూర్తయ్యే వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యారంటీ స్కీమును మైక్రోఫైనాన్స్‌ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఎంఎఫ్‌ఐఎన్‌ స్వాగతించింది. సవాళ్లెదుర్కొంటున్న తమ రంగానికి తోడ్పాటునిచ్చేలా సకాలంలో తీసుకున్న సరైన చర్యగా అభివరి్ణంచింది.  

→ మరోవైపు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతిదారులకు మరింత మద్దతునిచ్చేలా మ్యుచువల్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఎంసీజీఎస్‌–ఎంఎస్‌ఎంఈ)లో సవరణలు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సరీ్వసుల రంగాన్ని కూడా ఇందులో చేర్చినట్లు పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement