ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వాలు | Central Governments That Yielded To People Movements | Sakshi
Sakshi News home page

ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వాలు

Jul 25 2026 4:47 PM | Updated on Jul 25 2026 5:26 PM

Central Governments That Yielded To People Movements

ప్రజా ఉద్యమాలు.. ప్రభుత్వాల నిర్ణయాలను మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమం నుంచి, నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఏడాదికిపైగా సాగిన చారిత్రాత్మక పోరాటం వరకు.. ప్రజల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. తాజాగా.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నిరసనలు మరోసారి ప్రజా ఉద్యమాల శక్తిపై చర్చకు తెరలేపుతున్నాయి.

👉2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం జన్ లోక్ పాల్ బిల్లు అవినీతి వ్యతిరేక పోరాట చేశారు. రామ్ లీలా మైదానంలో 13 రోజుల పాటు నిరవధిక నిరహార దీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తలొగ్గి జన్ లోక్ పాల్ బిల్లు తీసుకోచ్చింది.

👉2012 డిసెంబర్ 15 ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక ఆత్యాచార ఘటన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నిర్భయ చట్టాన్ని తీసుకోచ్చింది

👉కేంద్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఏడాది పాటు సాగిన ఈ చారిత్రాత్మక పోరాటానికి తలొగ్గి, నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను అధికారికంగా రద్దు చేసింది.

👉నీట్  ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత కోరుతూ జంతర్ మంతర్ వేదికగా నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంతో చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement