విమాన చార్జీల నియంత్రణకు నిబంధనలేంటి?  | Supreme Court Seeks Centre Airfare Regulation Rules In sealed cover | Sakshi
Sakshi News home page

విమాన చార్జీల నియంత్రణకు నిబంధనలేంటి? 

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

Supreme Court Seeks Centre Airfare Regulation Rules In sealed cover

కేంద్రానికి సుప్రీం నోటీస్‌ 

న్యూఢిల్లీ: విమాన చార్జీల నియంత్రణకు రూపొందించిన నిబంధనల వివరాలను రెండు వారాల్లోగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆ నిబంధనలను ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ, సీల్డు కవర్‌లోనే తమకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. దేశంలోని ప్రైవేట్‌ విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలు, ఇతర అదనపు రుసుములను అనూహ్యంగా పెంచేయకుండా నియంత్రించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్‌ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ జరిపింది.  తదుపరి విచారణను ఆగస్ట్‌ 3వ తేదీకి వాయిదావేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement