ఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడంపై 'X' (ట్విట్టర్)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ 'రివ్యూ కమిటీ'కి హైకోర్టు ఆదేశించింది.
అయితే, అంతకుముందు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ స్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జాతీయ భద్రత పేరిట వ్యంగ్య (Satirical) అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై అభిజీత్ విమర్శలు గుప్పించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అయితే, ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి పిటిషనర్‌కు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక (IT) చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తుచేసింది. నేరుగా కోర్టు ద్వారా కాకుండా, ఐటీ చట్టం పరిధిలోని ఆ రివ్యూ కమిటీ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది.
#DelhiHighCourt on Friday issued notice on a plea by #AbhijitDipke-founder of '#CockroachJanataParty' challenging the blocking of the party's X account, while directing Review Committee of Ministry of Electronics and Information Technology to examine the Dipke's case granting him… pic.twitter.com/JflYEepD4x
— Kashmir Crown (@kashmircrownews) May 29, 2026


