breaking news
Daali Dhananjaya
-
హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన 'పుష్ప' నటుడు
'పుష్ప' సినిమా ఫేమ్ డాలి ధనంజయ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా! అతడికి డాలి పిక్చర్స్ అని ఓ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ కింద తెరకెక్కిన తాజా చిత్రం జేసీ. ద యూనివర్సిటీ అన్నది ఉపశీర్షిక. సూర్య ప్రఖ్యాత్, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కన్నడ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్స్‌లో వాచీ గిఫ్ట్అయితే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా అందరినోటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డాలి ధనంజయ సంతోషపడిపోయాడు. దీంతో థియేటర్లోనే సూర్య ప్రఖ్యాత్‌ను హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు, వెంటనే తన చేతికున్న వాచీని అతడికి బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమాడాలి ధనంజయ (Daali Dhananjaya) విషయానికి వస్తే.. ఈయన చివరగా తమిళంలో పరాశక్తి సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం కన్నడలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈయన అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కథనాలు కూడా రాస్తుంటాడు. View this post on Instagram A post shared by 𝐊𝐚𝐧𝐧𝐚𝐝𝐚 𝐍𝐞𝐰𝐬 𝐀𝐧𝐝 𝐊𝐅𝐈 𝐈𝐧𝐬𝐢𝐝𝐞𝐫 | 𝐆𝐮𝐛𝐛𝐢 (@kannadanews_kfiinsider) చదవండి: ఒక్కమాటతో తారక్‌పై గౌరవం మరింత పెరిగింది: పూజా బేడీ -
‘జాలిరెడ్డి’ కొత్త సినిమా.. లుక్ అదిరిందిగా..
సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్ రావు, తాజాగా "666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్" అనే టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ హీరోగా నటిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2 చిత్రాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ లో నటించారు.విజే ఫిలిమ్స్ బ్యానర్ పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ 2, పెద్ది చిత్రాల్లో నటిస్తోన్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ''666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'' చిత్రం కన్నడ తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది.


