దీపికా పదుకొణ్ మసాలా సాంగ్‌ను తొలగించిన 'ఫైటర్‌' టీమ్‌ | Deepika Padukone And Hrithik Roshan Romantic Song Removed In Fighter Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Fighter Song Controversy: దీపికా పదుకొణ్ మసాలా సాంగ్‌ను తొలగించిన 'ఫైటర్‌' టీమ్‌.. కారణం ఇదే

Published Fri, Jan 26 2024 2:40 PM

Deepika Padukone Hrithik Roshan Song Remove In Fighter Movie - Sakshi

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ జోడీగా నటించిన ఫైటర్‌ చిత్రం రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. భారీ యాక్షన్‌ చిత్రాన్ని  సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. సినిమా బాగుందని మంచి టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో రన్‌ అవుతుంది.

 కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’  సాంగ్‌ను తొలగించేశారు. ఈ సాంగ్‌ యూట్యూబ్‌లోకి వచ్చిన రోజు నుంచి దీపికా అందాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్‌లో సాంగ్‌ను చూసినవారు థియేటర్‌లో కూడా చూడొచ్చు అనుకుంటే ఫైటర్‌ మేకర్స్‌ షాక్‌ ఇచ్చారు. బిగ్‌ స్క్రీన్‌పై ఈ సాంగ్‌ కనిపించకపోయేసరికి వారిలో కొంతమేరకు నిరాశ కలిగింది.

ఈ సాంగ్‌లో హీరోయిన్ దీపికా పదుకొణ్‌ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో కీలకమైన పదవిలో ఉంటూ ఇలాంటి అసభ్యకరమైన సాంగ్‌లో చూపించడం కరెక్ట్‌ కాదని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్‌గా ఆ సాంగ్‌ను దర్శక నిర్మాతలు సినిమా నుంచి తొలగించడం జరిగింది. గతంలో పఠాన్‌ సినిమాలో కూడా దీపికా పదుకొణ్‌ మితిమీరిన అందాల ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె దుస్తుల మీద కూడా వివాదం చెలరేగింది.

కానీ ఆ సమయంలో షారుక్‌ ఖాన్‌ వివరణ ఇవ్వడంతో ఆ సాంగ్‌ థియేటర్‌లో కూడా రన్‌ అయింది. ప్రస్తుతం ఫైటర్‌ సినిమా విషయంలో ఎయిర్‌ ఫోర్స్‌ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ‘ఇష్క్ జైసా కుచ్’  సాంగ్‌ను తొలగించేశారు. యూట్యూబ్‌లో మాత్రం ఈ సాంగ్‌ను చూడవచ్చు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి దేశభక్తి సినిమాలో ఆ సాంగ్‌ లేకపోవడమే మంచిదని కూడా కామెంట్లు వస్తున్నాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement