బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఫైటర్‌’...14వ సారి 100 కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్

Fighter Movie To Become Hrithik Roshan 14th 100cr Grosser - Sakshi

రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో 14వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్ కి మరో రికార్డ్ కూడా దక్కింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఫైటర్ మూవీ ఆడియన్స్ ని అలరిస్తోంది. 

(చదవండి: ఆదిపురుష్‌..కొన్ని సీన్స్‌ నచ్చలేదు: ప్రశాంత్‌ వర్మ)

ఓవర్సీస్ లో సైతం ఫైటర్ మూవీ అద్భుతంగా రాణిస్తోంది.వార్ తర్వాత సింగిల్ డే లో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా ఫైటర్ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో సైతం హృతిక్ కెరీర్ లో ఫైటర్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. 

ఫైటర్ చిత్రం సాధించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో  ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ చిత్రంతో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో పాటు క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లో 100 కోట్లు సాధించాయి. 

హృతిక్ రోషన్ కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు లివే!

 1. కభీ ఖుషి కభీ గమ్
 2. క్రిష్ 
 3. ధూమ్2
 4. జోధా అక్బర్ 
 5. 5.జిందా న మిలేగా దోబారా 
 6. అగ్నిపథ్ 
 7. క్రిష్ 3
 8. బ్యాంగ్ బ్యాంగ్ 
 9. మొహంజదారో 
 10. కాబిల్ 
 11. 11,సూపర్ 30 
 12. వార్ 
 13. విక్రమ్ వేద 
 14. ఫైటర్ 

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top