ఆదిపురుష్‌..కొన్ని సీన్స్‌ నచ్చలేదు: ప్రశాంత్‌ వర్మ | Sakshi
Sakshi News home page

ఆదిపురుష్‌..కొన్ని సీన్స్‌ నచ్చలేదు: ప్రశాంత్‌ వర్మ

Published Sat, Jan 27 2024 7:20 PM

Prasanth Varma Says He Was Hurt By Adipurush Certain Sequences Of Adipurush Movie - Sakshi

ఆదిపురుష్‌ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదని, తానైనే వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేవాడినని ‘హనుమాన్‌’దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అన్నాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్‌లో కొన్ని సీన్స్‌ని చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా తెరకెక్కించారు. అయితే..కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనే గనుక ఆ సినిమా తీసి ఉంటే.. ఆ సన్నివేశాలను బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్‌ మేకర్‌కి అయినా అలాంటి భావన కలుగుతుంది. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీమ్‌ సపోర్ట్‌ని ‘హను-మాన్‌’ని అనుకున్న విధంగా తీర్చిదిద్దగలిగాం’అని ప్రశాంత్‌ వర్మ అన్నారు. 

(ఇదీ చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?)

హను-మాన్‌’విషయాకొస్తే.. తేజా సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా నటించిన చిత్రమిది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే ప్రశాంత్‌ వర్మ ఆ సినిమా పనులను ప్రారంభించారు. ఓ స్టార్‌ హీరో ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్)

Advertisement
 
Advertisement
 
Advertisement