'దయచేసి ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు'.. విశ్వక్‌ సేన్‌ విజ్ఞప్తి! | Vishwak Sen Reacts On His Social Media Account De Activation | Sakshi
Sakshi News home page

Vishwak Sen: 'ఆ విషయంలో ఒత్తిడికి గురికావద్దు'.. విశ్వక్‌ సేన్‌ పోస్ట్ వైరల్!

Jul 5 2024 7:52 PM | Updated on Jul 5 2024 8:39 PM

Vishwak Sen Reacts On His Social Media Account De Activation

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్‌ హీరో, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్. గోదావరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విశ్వక్‌ లైలా చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్  తన కెరీర్‌లో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

తాజా పోస్ట్‌లో విశ్వక్ సేన్ రాస్తూ..'అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ‍అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌కు  చిన్న విరామం మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. ట్విట్టర్‌ ఖాతాను నా టీమ్  నిర్వహిస్తుంది. నా ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేషన్‌ గురించి ఒత్తిడికి గురికావద్దని' సూచించారు.

అంతేకాకుండా.. 'ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని. ఇది చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. అయితే విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్ నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement