
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో అగ్ర కథానాయికగా స్టార్‌డమ్ అందుకుంది. కానీ, అందరిలాగే పెళ్లి కాగానే నటనకు గుడ్‌బై చెప్పి ఇంటికే పరిమితమైంది. 2009 తర్వాత మరే చిత్రంలోనూ కనిపించనేలేదు. ఇంతకీ ఆ కథానాయిక మరెవరో కాదు మాళవిక (Actress Malavika).
పెళ్లయ్యాక సినిమాలకు గుడ్‌బై
మాళవిక అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్ (Shweta Konnur Menon). చాలా బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంద్రముఖి చిత్రాల్లో నటించింది. తమిళంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ పాత్రల్లోనూ కాదనకుండా యాక్ట్ చేసింది. 2007లో సుమేశ్ మీనన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య రీఎంట్రీకి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇలా అయిపోయిందేంటి?
పుష్పలో సమంతలా 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' వంటి ఐటం సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అప్పట్లో నాజూకుగా ఉన్న మాళవిక ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్న ఈమె.. ఇంతలా లావైపోవడంతో అభిమానులు వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. మాళవిక ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు.