హీరోయిన్ శృతిహాసన్‌ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌! | Shruti Haasan Twitter account got hacked tweets goes viral | Sakshi
Sakshi News home page

Shruti Haasan: హీరోయిన్ శృతిహాసన్‌ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌!

Jun 24 2025 6:11 PM | Updated on Jun 24 2025 7:22 PM

Shruti Haasan Twitter account got hacked tweets goes viral

హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. హ్యాకింగ్‌ గురించి శృతిహాసన్ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్‌లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది.

s

శృతి హాసన్ ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు వరుసగా దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని - మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్‌ పోస్ట్ చేశారు. అయితే శృతి హాసన్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేసింది. 

k
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement