పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు | Pulwama Attack Anniversary PM Narendra Modi Pay Homage Martyred | Sakshi
Sakshi News home page

Pulwama Attack Anniversary: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు

Feb 14 2024 9:25 AM | Updated on Feb 14 2024 11:32 AM

Pulwama Attack Anniversary PM Narendra Modi Pay Homage Martyred - Sakshi

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారత్‌పై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement