‘ఎక్స్‌’ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఫీచర్‌ కొందరికే...??? | Only X Premium Subscribers Will Be Able To Make Live Streaming | Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌’ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఫీచర్‌ కొందరికే...???

Published Sat, Jun 22 2024 3:13 PM | Last Updated on Sat, Jun 22 2024 3:28 PM

Only X Premium Subscribers Will Be Able To Make Live Streaming

బిలినీయర్, టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసినప్పటి నుంచి సంచలన మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవడంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాన్ని కంపెనీ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

రాబోయే రోజుల్లో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే 'ఎక్స్'లో లైవ్ స్ట్రీమ్ (క్రియేట్ లైవ్ వీడియో స్ట్రీమ్‌) చేయగలరు. ఇందులో ఎక్స్ ఇంటిగ్రేషన్‌తో ఎన్‌కోడర్ నుంచి లైవ్ కూడా ఉంటుంది. ఈ లైవ్ కొనసాగించడానికి యూజర్లు ప్రీమియంకు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ దీనికి సంబంధించి ఓ ప్రకటన వెల్లడించినప్పటికీ.. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాని వెల్లడించలేదు. ఎక్స్ బేసిక్ ప్రీమియం చార్జీలు 215 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement