
ప్రపంచ కుబేరుడు.. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్, ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5:30 గంటల నుంచి యూజర్లు సమస్యలను నివేదిస్తూనే ఉన్నారు. లాగిన్ అవ్వడంలో, టైమ్‌లైన్‌లను యాక్సెస్ చేయడంలో మాత్రమే కాకుండా ట్వీట్స్ చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. 2,100 కంటే ఎక్కువ మంది యూజర్లు సమస్యలను నివేదించారు. కంపెనీ ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.
శుక్రవారం కూడా భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య కారణంగా.. అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ఇంజినీర్లు వెల్లడించారు. అయితే ఈ రోజు అంతరాయం కలగడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది.