 
													ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం, సులువుగా డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా స్మార్ట్‌గా ఉండాలి.   దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం  చూస్తాడు అనే  దూకుడు సినిమా  డైలాగును నూటికి నూరుపాళ్లు నిజం అంటారు మీరు ఈ వీడియో చూస్తే..
 
ది ఇన్‌స్టిగేటర్ అనే ట్విటర్ అకౌంట్ షేర్ చేసిన దాని ప్రకారం  రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్‌ని దాటడానికి నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణికులను రోడ్డు దాటిస్తున్నాడు. ఆగండాగండి.. ఇదేదో పుణ్యానికి చేస్తున్నాడనుకోరు. ఇందుకోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నాడు మనోడు. ‘‘డబ్బు  సంపాదించే అవకాశాన్ని అస్సలు వదులు కోరు కొంతమంది’’ అనే క్యాప్షన్‌తో  పోస్ట్ అయిన వీడియో ఇపుడు నెటిజనులను బాగా  ఆకట్టుకుంటోంది. పలు  నగరాల్లో డివైడర్  కష్టాలను తలుచుకుంటూ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. ఐడియా అదిరింది గురూ, ఇది బిజనెస్ అంటే,  స్మార్ట్ ఐడియా ఇలా  పలు కమెంట్లు  సందడి చేస్తున్నాయి. 
Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk
— The Instigator (@Am_Blujay) March 19, 2024

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
