స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యారా?ఈ వీడియో చూడండి! | Smartphone addiction hilarious video goes viral on social media | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యారా?ఈ వీడియో చూడండి!

Jul 2 2025 3:54 PM | Updated on Jul 2 2025 4:45 PM

Smartphone addiction hilarious video goes viral on social media

స్మార్ట్‌ఫోన్‌కు పిల్లా పెద్దా అంతా బందీ. నిద్ర లేచించి మొదలు రాత్రి  పడుకునేదాకా స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేందే క్షణం గడవదు అన్నట్టుగా స్మార్ట్‌ఫోన్‌ అడిక్షన్‌  అనడంలో ఎలాంటి సందేహహంలేదు.    ఏ  పనిచేస్తున్నా, తింటున్నా.. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుంటున్నా సరే ‘సెల్‌’ చేతిలో ఉండాల్సిందే. 

ముఖ్యంగా యువత సోషల్‌ మీడియాలో మోజులో పడి కొట్టుకుపోతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, నిపుణులు ఎంత మొత్తుకుంటున్నా  ఏమాత్రం ఫలితం ఉండటం లేదు.  దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో చూద్దాం.

చదవండి: ఎంత కష్టపడినా వెయిట్‌ తగ్గడం లేదా? ఇవిగో టాప్‌ సీక్రెట్స్‌!

పొద్దున్న లేచింది మొదలు  స్మార్ట్‌ఫోన్‌ను ఇడ్సిపెడ్తలేరు.. ఇక వేరే పనేలేదు ఇది ఇంటింటి రామాయణం అన్నట్టు ప్రతి ఇంట్లోనే  ఉండే తంతే.  తల్లిదండ్రులు చివాట్లు పెట్టడంతో  ఆ కాసేపు  జాగ్రత్తగా ఉండటం, తరువాత  షరా మామూలే. అలాగే  ఒక  టీనేజ్‌ అమ్మాయి భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌ను  చూస్తూనే ఉంటుంది. సెల్ఫీ తీసుకుంటోందో ఏమో గానీ అసలు ఏం తింటున్నా అనే సోయ లేకుండా ఉంటుంది. దీంతో చిర్రొత్తు కొచ్చిన ఒక పెద్దావిడ (బహుశా ఆ యువతి తల్లి కావచ్చు) పరుగెత్తుకొచ్చి,  ఫోన్‌తో కలిపి ఒక పెద్ద ప్లాస్టర్‌ చుట్టేసింది. ఆమె ఎంత విసిగెత్తిపోయిందీ ఆ ప్లాస్టర్‌ను చుట్టిన తీరును బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  

ఇదీ చదవండి: ఐకానిక్‌ ఆటో: ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ లగ్జరీ హ్యాండ్‌ బ్యాగ్‌, ధర తెలిస్తే.!

ఎక్స్‌లో షేర్‌అయిన ఈ వీడియో 50 లక్షలకు పైగా వ్యూస్‌ దక్కించుకుంది. వీడియోలో చైనీస్ టెక్స్ట్ ను మనం గమనించవచ్చు.  ‘లగెత్తరా ఆజామూ’ అంటూ నెటజన్లు ఛలోక్తులు విసురుతున్నరాఉ.  ఇది ప్రాంక్‌ వీడియో  కావచ్చని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు.  ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement