సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌ ఎంట్రీ | KCR Entry To Social Media, Open Account on Twitter Instagram | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌ ఎంట్రీ

Apr 27 2024 4:47 PM | Updated on Apr 27 2024 4:47 PM

KCR Entry To Social Media, Open Account on Twitter Instagram

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచారు.  అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. 

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఉద్య‌మ కాలం నాటి త‌న ఫొటోను కేసీఆర్ జ‌త చేశారు.

బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.

కాగా ప్రస్తుతం కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టి.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాల‌తో పాటు రాజ‌కీయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. 

నేడు నాగర్‌కర్నూల్‌కు
శనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement