
సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న పక్షి ల్యాండింగ్ అయ్యే విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పక్షి తన గమ్యస్థానానికి చేరే సమయంలో చూపిన నైపుణ్యం ఏరోడైనమిక్స్‌కు పాఠాలు చెబుతోంది. విమానం ల్యాండింగ్‌ను ఈ పక్షిని చూసే కనిపెట్టారేమోననిపిస్తోంది కదూ.. ఈ ఆలోచింపజేసే వీడియో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఓ పక్షి.. గమ్యానికి చేరే చివరి దశలో గాలిలో ఎగురుతూ వచ్చి నీటిలో సురక్షితంగా దిగిన దృశ్యం ఆసక్తి కలిగిస్తోంది. ఆ పక్షి కిందకు దిగే ముందు తన రెక్కలతో వేగాన్ని నియంత్రించుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. పర్ఫెక్ట్ టచ్‌డౌన్‌తో నీటిపై దిగుతుంది. ప్రకృతి పక్షికి నేర్పించిన గొప్ప ల్యాండింగ్ టెక్నిక్‌ను గమనించండి అంటూ ఓ అందమైన వీడియోను ఆయన షేర్ చేశారు.
Sharing this lovely video - please observe the great landing technique taught by nature to a bird with clear application of aerodynamics- Short finals, gears down, thrust reversers activated & Perfect touchdown. Aeroplanes copied it ! pic.twitter.com/TL9u3gwKXF
— CV Anand IPS (@CVAnandIPS) September 2, 2025