జ్యూస్‌ తాగుతుండగా గుండె ఆగింది! | Young Man Dies of Heart Attack After Drinking Juice in Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

జ్యూస్‌ తాగుతుండగా గుండె ఆగింది!

Sep 18 2025 12:33 PM | Updated on Sep 18 2025 12:44 PM

Shocking Video Viral: Man 30 Dies of Heart Attack While Drinking Juice Ibrahimpatnam

క్రైమ్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు జ్యూస్‌ తాగుతూ కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆలోపే అతని ప్రాణం పోయింది. 

బుధవారం రాత్రి 8గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్‌ తాగుతూ ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతనికి సీపీఆర్‌ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందాడు. 

గుండెపోటుతోనే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా పల్లిపాడుగా పోలీసులు తెలిపారు. అతని పేరు, ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇతర వివరాలు తెలియరావాల్సి  ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement