రోడ్డుపైనే కుప్ప​కూలిన టెన్త్‌ విద్యార్థిని | Class 10 Student Dies Of Heart Attack In Telangana Kamareddy, More Details Inside | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో విషాదం.. గుండెపోటుతో రోడ్డు మీద కుప్పకూలిన టెన్త్‌ విద్యార్థిని

Feb 21 2025 9:51 AM | Updated on Feb 21 2025 11:00 AM

Class 10 Student Dies Of Heart Attack In Telangana kamareddy

కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్‌ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్‌ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్‌ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement