
స్టేషన్‌ఘన్‌పూర్: ముక్కుపచ్చలారని చిన్నారి గుండె ఆగి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఉపాధి కోసం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.
రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే పాప మృతిచెందింది. కాగా, గుండె పోటుతో తమ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు.