
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారంలో భూదాన్ భూములు అన్యాక్రాంతమైనట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణతో పాటు ఔషద పరిశ్రమ భూ సేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని కోరారు. విచారణ అనంతరం నిజానిజాలపై తనకు నివేదిక అందించాలని రెవెన్యూ సెక్రటరీని ఆదేశించారు.