హనీ ట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి | Yoga Guru Ranga Reddy In Honey Trap | Sakshi
Sakshi News home page

హనీ ట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి

Sep 14 2025 4:05 PM | Updated on Sep 14 2025 4:29 PM

Yoga Guru Ranga Reddy In Honey Trap

సాక్షి, హైదరాబాద్‌:  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల‌లో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ మహిళలు సన్నిహితంగా ఉన్నారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో అమర్‌ గ్యాంగ్‌ బ్లాక్‌ మెయిల్‌కి తెరతీసింది.

అమర్‌ గ్యాంగ్‌కు భయపడిన రంగారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు అమర్‌ గ్యాంగ్‌ డిమాండ్‌ చేసింది.  దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హనీ ట్రాప్‌పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement