breaking news
GURUVU
-
భగవంతుణ్ణి దర్శించాలంటే..
గురువులు, ఆచార్యుల అనుగ్రహం లేకుంటే ఏదీ అర్థం కాదు, ఏదీ సాధించ లేము. అందుకే గురువును సాక్షాత్తూ త్రిమూర్తులయిన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో పోల్చారు పెద్దలు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు, మహాత్ములైన గురువులున్నారు. సర్వగురువులకూ గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాస మహర్షి ఉంటాడు. ఈ విధమైన ఏకత్వ గురుభావన ఈ దేశ సంప్రదాయం. గురువు అనుగ్రహం ఉంటేనే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అంటే భగవంతుణ్ణి దర్శించాలంటే ముందుగా గురువు అనుగ్రహాన్ని పొందాలి. ఇనప ముక్కను బంగారంగా మార్చే పరశువేది గురువు. అలాగని గురువును పరశువేదితోనే పూర్తిగా పోల్చడానికి వీలు కాదు. అంతకు మించినవాడు. అన్నింటికీ అతీతుడు.మనిషి అయినవాడు బాధ్యతల నుంచి పారిపోకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావులేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా ఎలా నిర్వహిస్తాడో వ్యాసభగవానుడు, శంకర భగవత్పాదుల వంటి గురువులు వైరాగ్యం అంటే బాధ్యతలను వదిలిపెట్టడం కాదని, వ్యామోహపడకుండా బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించడమనే సందేశాన్ని ఈ సమాజానికి అందించారు. ఇక అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి, సంపూర్ణంగా గురు కృపను పొందినవారే.గురువును ఎప్పుడూ వినయ విధేయతలతో ప్రసన్నం చేసుకోవాలే కానీ, అహంకారంతో తూలనాడి వారి ఆగ్రహానికి గురికాకూడదు. దేవేంద్రుడంతటివాడు గురువైన బృహస్పతి తన కొలువులోకి రావడాన్ని చూసి కూడా లేవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆయన ఆగ్రహానికి గురై సింహాసనంతో సహా సర్వసంపదలనూ పోగొట్టుకున్నాడు. చివరకు తప్పు తెలుసుకుని ఆయనను ఆశ్రయించి ఆయన అనుగ్రహంతోనే తిరిగి పూర్వ వైభవాన్ని పొందాడు. అందుకే గురువు గురువే.– డి.వి.ఆర్.జులై 10, గురువారం గురు పూర్ణిమ -
చదువులో కాదు.. అనుభవంలో ...
త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో...‘‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు... కఱుకైన హృద్రోగ గహనమును గొట్ట....’’ అంటారు. ఎటువంటి గుణాలయినా ఉండొచ్చు. ఎంత తెలివిగలవాడయినా కావొచ్చు. ఏది తెలియాలో అది తెలియాలంటే మాత్రం గురువు ఉండి తీరాలి. ఏది తెలియాలి... అంటే.. కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... హృద్రోగం చాలా కరుకైనదే.. ఊపిరి అందని వాడికి అది పరీక్షాకాలం... ఇంతమందిని విడిచిపెట్టి పోతున్నానన్న భావన.. అది కరుకైనది... దానిని గహనమున కొట్ట... అంటే అరణ్యంలా.. ఎలా చేస్తున్నాడో తెలియకుండా దానిని కొట్టగలిగినవాడు గురువు... అన్నాడు. తెలియని విషయాలు తెలియుకుండా పోవడం... తెలియవు అన్నంత వరకు పనికొస్తాయేమో గానీ.. ఆత్మ అనుభవం లోకి రావడం... అద్వైతానుభూతిని పొందడం... అన్న దగ్గరకు వస్తే అది గురువుగారి వీక్షణములచేత మాత్రమే సాధ్యమవుతుంది.. అంటాడు త్యాగయ్య. అమ్మవారిని మూడు రకాలుగా – కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని... అక్షి సంబంధంగా పిలుస్తారు. ఆమె గురు మండల రూపిణి. గురువులు కూడా మూడు రకాలుగా అను గ్రహిస్తారు. కామాక్షి–కుక్కుట న్యాయం.. అలాగే గురువు హస్త మస్తక సంయోగంలో శిష్యుడి బ్రహ్మస్థానం లో తన చేతిని ఉంచి అనుగ్రహిస్తాడు. అది పక్షి గుడ్డును పొదిగి దాని నుంచి పిల్ల వచ్చేటట్లుగా చేయడంలాగా ఉంటుంది. అలా పొదుగుతాడు శిష్యుడిని. అదే స్పర్శ దీక్ష. రెండవది మీనాక్షి. విజ్ఞాన శాస్త్రంలో ఎలా ఉందనే విషయం పక్కనబెడితే యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం చేపగుడ్లు పెట్టి, వాటిని ప్రేమగా చూసిన మాత్రం చేత అవి పిల్లలవుతాయి.. అంటుంది. అలా గురువు కేవలం తన చూపులతో శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా భగవాన్ రమణులు ఒకసారి అనుగ్రహించారు. అది మీనాక్షి. మూడవది విశాలాక్షి. బ్రహ్మాండం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పరదేవత చూస్తుంటుంది. అందరూ తన బిడ్డలే అన్న స్మరణతో అనుగ్రహిస్తుంటుంది. ‘వాడు వృద్ధిలోకి రావాలి’ అని గురువు గారు సంకల్పించినంత మాత్రం చేత శిష్యుడు ఆ స్థితిని పొందుతాడు. అది విశాలాక్షీ తత్త్వం. నిజానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి... ఈ మూడూ కూడా శిష్యుడి వైపునుంచి గురువుకు, గురువు వైపునుంచి శిష్యుడికి ఉంటాయి. అదొక విచిత్రం. తెలిసినా తెలియక పోయినా నన్ను గురువుగారు ఒకసారి ముట్టుకుంటే చాలు, చూస్తే చాలు, స్మరిస్తే చాలు.. అన్న నమ్మకం ఉంటే... వాడు గురి కలవాడు. ఎవరి మీద అది ఉందో వారు గురువయిపోతారు. వాడి కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... అంటే అలా కొట్టగలిగినవాడు గురువు.. అంటున్నాడు త్యాగరాజు. అజ్ఞాన గ్రంథులను తొలగించి జ్ఞానాన్ని కలుగ చేయాలి అంటే... ఒక సద్గురువు ఉండాలి. అప్పుడు భగవంతుని దర్శనం.. ఆత్మ అనుభవంలోకి వచ్చి... శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, నిరంజనమైనది, నిష్కళంకమైనది... అయిన ఆత్మ నేను తప్ప శరీరం కాదు... అని శ్లోకాల్లో చెప్పినవి, నోటితో చెప్పినవి కాక.. అనుభవంలో తెలుసుకుంటాడు శిష్యుడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జీవితంపై అవగాహన అవసరం
మార్కొండపాడు (చాగల్లు) : ప్రతి ఒక్కరూ ప్రకృతి, సమాజాన్ని పరిరక్షిస్తూ తన సుఖాన్ని సమాజ సుఖంగా పెంపొందించుకోవాలని ఉండ్రాజవరం బౌద్ధధర్మ పీఠం గురువు పూజ్యాబతి అనాలియో అన్నారు. చాగల్లు మండలం మార్కొండపాడులోని సుంకవల్లి వెంకన్నచౌదరి నివాసంలో సోమవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి మనిషికి జీవితంపై అవగాహన కలిగి సన్మార్గంలో పయనించాలని సూచించారు. సత్యాన్వేషి అయిన బుద్ధుని సూక్తులు అందరూ అచరించాలని సందేశమిచ్చారు. వియత్నం, మలేషియా నుంచి వచ్చిన బౌద్ధులు ఆయనతో ఉన్నారు. సుంకవల్లి ఫౌండేష¯ŒS అధినేత సుంకవల్లి వెంకన్నచౌదరి, వైఎస్సార్ సీపీ నాయకులు ఉప్పూలూరి బాబురావు, తమ్మిశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు.