
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ నమో మిషన్ వందే గౌమతరం ఆధ్యాత్మిక విభాగానికి రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా గుండల్ దతు యాదవ్ నియమితులయ్యారు. ఆగస్టు 28 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని నమో మిషన్ వందే గౌమతరం తెలిపింది. వ్యవస్థాప అధ్యక్షుడు వీర మాధ్వీరాజ్ ఆచారి సీపెల్లి నుంచి ఈ మేరకు యాదవ్ నియామక పత్రం అందుకున్నారు.
గో సేవ, ఆధ్యాత్మికత, సేవా దృక్పథం, సామాజిక సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసినందుకు గుండల్ దతు యాదవ్‌ను నియమించినట్టు వెల్లడించింది. సమాజంలో నైతిక విలువలను వ్యాప్తి చేయడం, ప్రజలకు జ్ఞానం పంచడంలో ముఖ్యపాత్ర పోషించాలని అభిలషించింది. గో రక్షణ ప్రధాన ధ్యేయంగా నమో మిషన్ వందే గౌమతరం సంస్థ పనిచేస్తోంది.