
ప్రతీకాత్మక చిత్రం
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. కె చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో పోలీసులు ఆకస్మిక ఆపరేషన్‌తో రేవ్ పార్టీ గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసుకుంది.
ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఇచ్చే క్రమంలో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసింది ఫర్టిలైజర్ కంపెనీ. దీనిపై సమాచారం అందుకున్న రాచకోండ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
దాంతో వీరి వ్యవహారం బట్టబయలైంది. లిక్కర్ కోసం ఎక్స్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నారు ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అయితే అక్కడ అమ్మాయిల ఏర్పాటు అనేది చట్ట విరుద్ధం కావడంతో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డైల్ 100 ఫిర్యాదు మేరకే పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.