
శేరిగూడ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్న మున్సిపల్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని ‘పవన్ పెట్రోల్ బంక్’లో కల్తీ చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కారుకు ఆ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించిన అనంతరం ఆగిపోయింది. పెట్రోల్ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంపై అనుమానం వచ్చింది సదరు కారు యజమానికి.

నిన్న(గురువారం, సెప్టెంబర్ 11వ తేదీ) రాత్రి పెట్రోల్ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంతో బంక్ సిబ్బంది మార్నింగ్ రమ్మన్నారు. ఇక చేసేది లేక ఆ కారును అక్కడే వదిలేసి వేరే కారులో వారు వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం కారును తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో పెట్రోల్ బంక్ మేనేజర్.. తమ ఓనర్ వస్తారని, అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్పినట్లు కారు బాధితుడి తెలిపాడు.

అయితే మధ్యాహ్నం అయినా బంక్ యజమాని రాకపోవడంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తాము ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కారు ఆగిపోవడంతోనే అనుమానం వచ్చిందని, అయితే చేసేది లేక అప్పుడు వెళ్లిపోయి, మళ్లీ ఈరోజు వచ్చామన్నారు. తమను పట్టించుకోకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు లైవ్‌లోనే పెట్రోల్ తీస్తే అసలు విషయం బయటపడింది. తనిఖీలో భాగంగా బాటిల్‌లో తీసిన పెట్రోల్‌లో సగానికి పైగా నీళ్లే ఉన్నాయని, అందుచేత తమ కారు ఆగిపోయిందని తెలిపాడు. ఇలాగే చాలామంది తమ వాహనాలు దారిలో ఆగిపోవడంతో మళ్లీ బాటిల్స్ పట్టుకుని ఆ బంక్‌కు వచ్చిన సంగతిని బాధితుడు తెలిపాడు.
