TG Number Plates: ‘TS’ స్టిక్కర్ల స్థానంలో ‘TG’ స్టిక్కర్లు | TG replaces TS as State code in Telangana | Sakshi
Sakshi News home page

TG Number Plates: ‘TS’ స్టిక్కర్ల స్థానంలో ‘TG’ స్టిక్కర్లు

Sep 21 2025 6:01 PM | Updated on Sep 21 2025 6:05 PM

TG replaces TS as State code in Telangana

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి గల గుర్తింపు గతంలో ‘TS’ గా ఉండేది. ప్రభుత్వం దానిని కొత్తగా ‘TG’ గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనకనుగుణంగా  హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన అన్ని వాహనాలపై ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ స్టిక్కర్లను తొలగించి, కొత్తగా ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లను అమర్చాలని, అన్ని పెట్రోల్ వాహనాలు మరియు పోలీస్ స్టేషన్ వాహనాలను కొత్త రూపంలోకి తీసుకురావాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశించారు.

దీనికి సంబంధించి సీఎఆర్‌  హెడ్‌క్వార్టర్స్ అధికారులు మొత్తం 188 ప్రభుత్వ వాహనాలపై పాత ‘TS’ స్టిక్కర్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త ‘TG’ స్టిక్కర్లను అమర్చే ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీసుల వద్ద ఉన్న అన్ని వాహనాలకు సుమారు రూ.1.6 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ పూర్తిచేయబడింది. ఇందులో ప్రతి వాహనంపై స్టిక్కర్లను తొలగించడం, వాటి స్థానంలో తెలంగాణ పోలీస్ స్టిక్కర్లను అమర్చడం, మెషిన్ పాలిషింగ్ చేయడం, అవసరమైతే బంపర్లు, డోర్లు, ప్యానెళ్లపై డెంటింగ్ మరియు పెయింటింగ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ విధంగా వాహనాలను సరైన స్థితిలో ఉంచారు అని అధికారులు తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు స్టిక్రరింగ్‌ ప్రక్రియ పూర్తయిన 134 పెట్రోలింగ్ వాహనాలను సీఎఆర్‌ హెడ్‌క్వార్టర్స్ అధికారులు పునఃప్రారంభించారు. దీని వలన నగరంలోని శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిరోధం, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనతో పాటు పోలీసుల పటిష్ఠత కొనసాగించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని ఇతర వాహనాలు — ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, పైలట్ వాహనాలు, అలాగే ఇంటర్‌సెప్టర్ వాహనాలు కూడా రాబోయే కొన్ని రోజుల్లో స్టిక్కరింగ్‌  ప్రక్రియ పూర్తిచేసి, అవి కూడా పూర్తి స్థాయిలో సక్రమ స్థితిలోకి మారుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లకు వాటిని శుభ్రంగా, సక్రమ స్థితిలో ఉంచే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement