ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్‌లను కూడా అప్‌లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం.
క్లౌడ్‌ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లో అంతర్గత సర్వర్ లోపం, దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను వేలమంది యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెళ్లదీస్తున్నారని డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. ఈ సమస్యపై కంపెనీ స్పందించలేదు.

డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఈ సమస్య భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు మొదలైంది. క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ అవ్వడం వల్ల కేవలం ఎక్స్ మాత్రమే కాకుండా.. ఓపెన్ ఏఐ సంస్థల సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో మా బృందం నిమగ్నమై ఉందని.. క్లౌడ్‌ఫ్లేర్ టీమ్ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు


