అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో.. మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి.
భారతదేశంలో నేడు (మంగళవారం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 123660 (10 గ్రామ్స్), 22 క్యారెట్ల ధర రూ. 1,13,350 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1740 & రూ. 1600 తక్కువ. పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నవంబర్ 13న రూ. 1,28,620 లక్షల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 18) రూ. 1,23,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ఐదు రోజుల్లో రూ. 4960 తగ్గిందని తెలుస్తోంది. అంటే ఐదు రోజుల్లో దాదాపు 5000 రూపాయలు తగ్గిందన్నమాట.
వెండి విషయానికి వస్తే.. రూ. 1.83 లక్షల (నవంబర్ 13) వద్ద ఉన్న సిల్వర్ రేటు.. నేటికి రూ. 1.70 లక్షలకు చేరింది. అంటే వెండి రేటు కూడా ఐదు రోజుల్లో రూ. 13వేలు తగ్గిందన్నమాట.
అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ వడ్డీ రేటు పెరిగినప్పుడు.. గోల్డ్ రేటు తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గినప్పుడు.. పసిడి ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలల మీద.. రాజకీయ, భౌగోళిక కారణాలు.. ఆర్ధిక వ్యవస్థలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..


