నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్.. | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Say About Real Money and Investment | Sakshi
Sakshi News home page

నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..

Nov 17 2025 4:51 PM | Updated on Nov 17 2025 5:13 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Say About Real Money and Investment

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఇందులో వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన & బహుశా అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడు అని పేర్కొన్నారు.

వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన & ధనవంతుడైన పెట్టుబడిదారుడు. కానీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడం లేదని అన్నారు. పెట్టుబడులకు సంబంధించి అతను చెప్పేది సరైనదే కావచ్చు. కానీ స్టాక్‌లు, బాండ్‌లు, రియల్ ఎస్టేట్ వంటివన్నీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.

ఏ సమయంలో అయిన బూస్ట్ అవుతాయి
నేను బిట్‌కాయిన్, ఎథెరియంలను కలిగి ఉన్నట్లే.. బంగారం, వెండి నాణేలను కలిగి ఉన్నాను. నేను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, యూఎస్ ట్రెజరీ లేదా వాల్ స్ట్రీట్‌ను నమ్మను. ఎందుకంటే.. బిట్‌కాయిన్ & ఎథెరియం ఏ సమయంలో అయిన బూస్ట్ అవుతాయి. వీటిని ప్రజల డబ్బుగా, నిజమైన బంగారం & వెండిని దేవుని డబ్బుగా వర్గీకరిస్తాను. నా దృష్టిలో ఫెడ్, యూఎస్ ప్రభుత్వం & వాల్ స్ట్రీట్ డబ్బు అంతా ఫేక్ మనీ.

నకిలీ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి కారణం
ఎప్పుడూ మీరు నిజమైన డబ్బులోనే ఇన్వెస్ట్ చేయండి. నిజమైన ఆస్తులు అందుబాటులో ఉన్నప్పుడు.. నకిలీ ఆస్తులలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?. చాలా మంది నకిలీ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి కారణం.. పాఠశాలలో ఆర్థిక విద్యను బోధించకపోవడమే అని కియోసాకి అన్నారు.

ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి

బిట్‌కాయిన్‌లు పరిమిత సంఖ్యలో (21 మిలియన్స్) మాత్రమే ఉన్నాయి. కానీ నకిలీ డబ్బు (కరెన్సీ) అపరిమితంగా ఉంది. 25 సంవత్సరాల క్రితం.. రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో, "సేవర్స్ ఆర్ లూజర్స్" అని చెప్పినందుకు నాపై దాడి జరిగింది. కానీ ఈరోజు నేను 25 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాన్ని రాసిన రచయితగా నిలిచాను. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని కియోసాకి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement