ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About What Can Poor People Do | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి

Nov 11 2025 7:33 PM | Updated on Nov 11 2025 8:40 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About What Can Poor People Do

వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, రచయిత అయిన 'రాబర్ట్ కియోసాకి' ఎప్పటికప్పుడు ఆర్ధిక సూత్రాలను చెబుతూ.. పెట్టుబడికి సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. పేదవాళ్లు ఏం చేయగలరు? అని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

పేదవాళ్ల పట్ల నాకు జాలి ఉంది. పేదవాళ్ళకి డబ్బు ఇవ్వడంపై నాకు నమ్మకం లేదు. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి ఒక చేప ఇస్తే.. ఒక రోజు ఆహరం పెట్టినట్లే. అదే వ్యక్తికి చేపలు పట్టడం నేర్పిస్తే.. జీవితాంతం ఆహారం పెట్టినట్లే.. అని కియోసాకి పేర్కొన్నారు.

ఇంతకు ముందు ట్వీట్‌లో వెండి 50 డాలర్లకు చేరింది. తరువాత 70 డాలర్లకు చేరుతుందా అని అడిగాను. దీనిపై చాలామంది స్పందించారు. ప్రపంచంలో చాలా మంది ప్రజలు, పేదవాళ్ళు కూడా 50 డాలర్ల వెండిని కొనుగోలు చేయగలరు. కొద్దిమంది మాత్రమే లక్ష డాలర్లు పెట్టి బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయగలరు. నేను నా మొదటి బిట్‌కాయిన్‌ను 6000 డాలర్లకు కొన్నాను. నా మొదటి 100 బిట్‌కాయిన్‌లు విలువ ఇప్పుడు మిలియన్స్ దాటేసింది.

ఇప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత వెండి ఔన్సుకు 200 డాలర్లు ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర భారీగా పెరిగినప్పుడు కొందరు కొనడం ప్రారంభిస్తారు. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనండి. రేటు పెరిగినప్పుడు అమ్మండి. జాగ్రత్త అంటూ.. ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..

కియోసాకి ట్వీట్ చూస్తుంటే.. వెండి ధరలు ప్రస్తుతం కొంత తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు కొనండి, భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అమ్మండి అని చెబుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశంలో ఈ రోజు వెండి ధర రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ. 1.70 లక్షలకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement