‘ఎక్స్‌ చాట్‌’ ప్రారంభించిన మస్క్‌ | XChat introduced by Elon Musk within the X app | Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌ చాట్‌’ ప్రారంభించిన మస్క్‌

Jun 4 2025 4:13 PM | Updated on Jun 4 2025 5:26 PM

XChat introduced by Elon Musk within the X app

ప్రముఖ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ టూల్స్‌ అయిన వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్‌(గతంలో ట్విటర్‌) కొత్తగా ‘ఎక్స్‌ చాట్‌’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్‌మస్క్‌ తెలిపారు.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో ఈమేరకు ఎక్స్‌ చాట్‌ వివరాలు ప్రకటించారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ స్పేస్‌లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలు

ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్‌డేటెడ్‌ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్‌లో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్‌గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా ఎక్స్‌ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement