తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ: రేవంత్‌కు కేటీఆర్‌ కౌంటర్‌ | KTR Counter To CM Revanth Mahabubnagar Comments | Sakshi
Sakshi News home page

తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ: రేవంత్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

Mar 6 2024 8:40 PM | Updated on Mar 6 2024 9:19 PM

KTR Counter To CM Revanth Mahabubnagar Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌కు తెలంగాణ ‘ఆత్మ’ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్‌ దాడి చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవం విలువ తెల్వనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు.

ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. గొల్డెన్‌ తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిదని ప్రశ్నించారు.ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా. అని నిలదీశారు. నిన్న మొన్న‌టి దాకా గుజ‌రాత్ మోడ‌ల్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్ర‌ధాని ప‌క్క‌న సీటు ఇవ్వ‌గానే.. ఆయ‌న గురించి గొప్ప‌లు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.. ఇదేం రీతి.. రేవంత్ అంటూ కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు.
చదవండి: కేంద్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తా: సీఎం రేవంత్‌ 

‘తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా”“సమగ్ర అభివృద్ధికి చిరునామా” అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన?

నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు  తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..” నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్’ అంటూ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement