నువ్వా! కేసీఆర్‌ పేరును తుడిచేది?: రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం | KTR Strong Counter TO CM Revanth Over Comments On KCR | Sakshi
Sakshi News home page

చిట్టినాయుడు.. నువ్వా! కేసీఆర్‌ పేరును తుడిచేది?: రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం

Oct 30 2024 11:54 AM | Updated on Oct 30 2024 1:37 PM

KTR Strong Counter TO CM Revanth Over Comments On KCR

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య మాటల యుద్దం నెలకొంది. కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ రేవంత్‌ చేసిన సంచలన వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌ చెప్పులు మోసిన నాడు కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. పదవులు కోసం రేవంత్‌ పరితపిస్తున్న కాలంలో.. కేసీఆర్‌ తనకు ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడని గుర్తుచేశారు. ‘నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్’ అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్‌.. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడు. చిట్టినాయుడు. నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్‌.’ అని పేర్కొన్నారు.

కాగా కేసీఆర్‌కు రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఎక్స్‌పైరీ మెడిసిన్‌.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్‌ చేశామన్న రేవంత్‌.. ‘కేసీఆర్‌ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్‌ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్‌ చేయాలో మాకు తెలుసు’ అంటూ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement