మత్తు వదలరా-2 ట్విటర్‌ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే? | Tollywood Movie Mathu Vadalara 2 Twitter Review In Telugu | Sakshi
Sakshi News home page

Mathu Vadalara 2: మత్తు వదలరా-2 రిలీజ్‌.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Sep 13 2024 8:20 AM | Updated on Sep 13 2024 11:13 AM

Tollywood Movie Mathu Vadalara 2 Twitter Review In Telugu

శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి రీతేష్‌ రానా దర్శకత్వం వహించారు. పార్ట్-1  హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇ‍ప్పటికే ప్రీమియర్ షోలు పడిపోవడంతో ట్విటర్‌ వేదికగా ఆడియన్స్‌ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

(ఇది చదవండి: మత్తు వదలరా 2’ ట్రైలర్‌: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్‌)

మత్తు వదలరా-2 ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉందంటూ ఆడియన్స్‌ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్‌ హాఫ్‌లోనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయమని అంటున్నారు. నాన్‌స్టాప్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. సత్య తన ఫర్మామెన్స్‌, కామెడీ అదిరిపోయిందని బ్లాక్‌బస్టర్‌ హిట్ ఖాయమంటున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షికి ఎలాంటి బాధ్యత వహించదు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement