బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్‌.. అసలేం జరిగిందంటే? | Bollywood Actress Swara Bhasker Twitter account permanently Suspended | Sakshi
Sakshi News home page

Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్ ట్విటర్‌ ఖాతా సస్పెండ్‌.. అసలేం జరిగిందంటే?

Jan 30 2025 6:59 PM | Updated on Jan 30 2025 7:17 PM

Bollywood Actress Swara Bhasker Twitter account permanently Suspended

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ట్విటర్‌ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్‌లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్  ఈ ట్విటర్‌ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్‌ చేసింది. ఈ రెండు పోస్ట్‌లపై ట్విటర్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు.  

కాగా.. స్వర భాస్కర్‌ విషయానికొస్తే సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్‌ అహ్మద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్‌ మ్యారేజ్‌ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement