
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.
మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.
𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo
— Elon Musk (@elonmusk) November 22, 2024