క్యాట్‌లో మంచి స్కోర్‌.. ఐనా సైన్యంలోకి! కానీ చివరికి.. | Colonel Anurag Upadhyay: he scored 99th percentile in cat but chose the army | Sakshi
Sakshi News home page

Colonel Anurag Upadhyay: క్యాట్‌లో మంచి స్కోర్‌ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..

Sep 10 2026 4:58 PM | Updated on Sep 10 2026 5:45 PM

Colonel Anurag Upadhyay: he scored 99th percentile in cat but chose the army

క్యాట్‌లో మంచి మార్కులు సంపాదించి చక్కటి కార్పొరేట్‌ కొలువుల్లో మంచి ప్యాకేజ్‌తో జాబ్‌ కొట్టాలనేది చాలామంది యువత డ్రీమ్‌. అయితే ఈ వ్యక్తి కష్టతరమైన క్యాట్‌ పరీక్షలో అవలీలగా మంచి మార్కులు తెచ్చుకున్నా..వద్దని మరి దేశ సేవ మిన్నా అటూ సైన్యంలో చేరాడు. కానీ అతడు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచి ఎన్ని పరీక్షలు పెట్టిందంటే..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయినా వెనక్కి తగ్గకుండా వెళ్లినా..ఈసారి మరింత కఠినంగా పరీక్ష పెట్టింది. ఎంతలా అంటే .. కథన రంగంలో కాదు నీ శరీరంతో యుద్ధ చేయి అని సవాలు విసురుతున్నట్లుగా దాడి చేస్తోంది ఆ అరుదైన వ్యాది. 

ఆ వ్యక్తే మాజీ ఆర్మీ అధికారి కల్నల్‌ అనురాగ్‌ ఉపాధ్యాయ్‌. క్యాట్‌ పరీక్షలో మంచి ప్రతిభ కనబర్చినప్పటికీ కార్పొరేట్‌ కెరీర్‌ వద్దంటూ ఆర్మీని ఎంచుకున్నారు. అందులో ఆయన అత్యంత కఠినతరమైన ఆయన పారా స్పెషల్‌ ఫోర్సెస్‌లోకి వెళ్లారు. ఇది భారతదేశపు అత్యున్న స్పెషల్‌ ఫోర్సెస్‌. అలా ఆయన 3 PARA (SF)తో తన ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత, సరికొత్తగా ఏర్పాటు చేసిన 12 PARA (SF) రెజిమెంట్‌ను బృందంలో కీలక సభ్యునిగా వ్యవహరించారు. అయితే ఆయన కలలు కన్న ప్రపంచంలోకి సాగనివ్వకుండా విధి ఆయన జీవితాన్ని ఎలాంటి కుదుపులకు గురిచేసిందంటే..

చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు..ఐనా..
2008లో గుండెపోటుకు గురైనప్పటికీ దేశ సేవను కొనసాగించాలనే అచంచలమైన లక్ష్యంతో తిరిగి విధుల్లోకి చేరారు. ఆయన ఇచ్చిన ఎంట్రీని తోటి మాజీ సైనికులు దృఢ సంకల్పం, శక్తిమంతమైన అంకితభావానికి కేరాఫ్‌గా అభివర్ణించారు. ఇంతలా రోగంతోనే యుద్ధం చేసిన ఈ వీరుడిని మరోసారి అనారోగ్యం దాడి చేసింది. 

ఈ సారి 2025 ఆగస్టులో తీవ్రమైన పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ఆ స్ట్రోక్‌ వల్ల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి నరాలకు సంబంధించిన లాక్డ్-ఇన్ సిండ్రోమ్ బారినపడ్డారు. దీని వల్ల తీవ్ర పక్షవాతానికి గురై మొత్తం అవయవాలన్ని చచ్చుబడిపోతాయి. కేవలం కంటి కదలికలతో ఆల్ఫాబేట్‌ స్కానింగ్‌తో మాత్రమే మాట్లాడగలరు. ఆయనకు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతున్నా.. ఆయన కదలలేరు, మాట్లాడలేరు. అంతేగాదు ఇతర అనారోగ్య సమస్యల రీత్యా మోకాళ్ల కింద నుంచి రెండు కాళ్లను కూడా తొలగించారు వైద్యులు

ఈసారి విధి అరుదైన వ్యాధి రూపంలో ఆయన్ను ఓడించేలా దాడి చేస్తున్నా..అనురాగ్‌ కనబరుస్తున్న మొక్కవోని ధైర్యం ప్రతి ఒక్కర్ని కదిలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడి కుటుంబం ఈ అరుదైన వ్యాధిపై పరిశోధనలు చేసే శాస్రవేత్తలు, నిపుణులు దయచేసి అతడికి సాయం చేయాలని కోరుతున్నారు. దేశ సేవ కోసం ఇంతలా కష్టపడ్డ అతడి కోసం ఏదైనా చేసి రక్షించండి అని వేడుకుంటున్నారు. 

అంతేగాదు అతడి చివరి శ్వాస వరకు దేశ సేవలో ఉండాలనేది అతడి ఆశయం అంటూ ఆర్మీ అధికారులను, నిపుణులను సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి అసలు అనారోగ్య సమస్య వస్తేనే..రిస్క్‌ తీసుకుని పనిచేసే ఉద్యోగాల దరిదాపుల్లోకి రావడానికి ఇష్టపడం. కానీ అజేయమైన తెగువతో దేశ సేవ తన కర్తవ్యం, డ్యూటే దైవంగా సాగిన అతడి అంకితభావానికి, అనారోగ్యంతో పోరాడిన అతడి మొక్కవోని ధైర్యానికి జయహో అనాల్సిందే కదూ..!.

(చదవండి: ఎస్‌బీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్‌గా!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement