వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్! | Top AI Tools Of 2026 To Boost Productivity And Save Hundreds Of Hours, Best Tools For Coding, Content Creation, And Automation | Sakshi
Sakshi News home page

Best AI Tools 2026: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!

Sep 18 2026 8:24 AM | Updated on Sep 18 2026 9:25 AM

Stop Wasting Time Incredible AI Tools You Must Use in 2026

నేటి డిజిటల్ యుగంలో కాలాన్ని ఆదా చేసుకోవడం, ఉత్పాదకతను పెంచుకోవడం ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ఒకప్పుడు గంటల తరబడి సమయం పట్టే పనులను నేడు వినూత్నంగా దూసుకొచ్చిన ఏఐ టూల్స్ కేవలం నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కోడింగ్, డిజైనింగ్, వీడియో మేకింగ్, రీసెర్చ్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్.. ఇలా ఏ రంగంలో చూసినా ఏఐ అసిస్టెంట్ల హవా నడుస్తోంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 నాటికి వందల గంటల విలువైన సమయాన్ని మిగిల్చి, పని సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఉపయోగపడుతున్న కొన్ని ఏఐ టూల్స్ సమగ్ర సమాచారం ఇక్కడ పరిశీలిద్దాం.

పరిశోధన.. సమాచార విశ్లేషణ

Claude: సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి, లోతైన విశ్లేషణలు చేయడానికి, సృజనాత్మక రచనలకు మెరుగైన టూల్.

Perplexity: ఇంటర్నెట్ నుంచి తాజా, కచ్చితమైన సమాచారాన్ని ఆన్‌లైన్ సోర్స్‌లతో సహా అందిస్తూ రీసెర్చ్ పనిని సులభతరం చేస్తుంది.

NotebookLM: మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌, పీడీఎఫ్‌లను విశ్లేషించి సారాంశాన్ని అందించడానికి ఉపయోగపడే గూగుల్ ఆధారిత స్మార్ట్ టూల్.

Elicit: సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లను త్వరగా వెతికి కీలకమైన వివరాలను అందిస్తుంది.

SciSpace: సంక్లిష్టమైన పరిశోధనా పత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి ఉపయోగపడుతుంది.

కంటెంట్ రైటింగ్.. ప్రాంప్టింగ్

GeminiAI: మెరుగైన వ్యాసాలు, కథనాలు, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడంలో సహకరించే శక్తివంతమైన గూగుల్ ఏఐ అసిస్టెంట్.

ChatGPT: సృజనాత్మక ఆలోచనలు, కంటెంట్ క్రియేషన్, కోడింగ్ సందేహాల నివృత్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టూల్.

Grok: రియల్-టైమ్ ఆన్‌లైన్ ట్రెండ్స్, సమాచారాన్ని వేగంగా విశ్లేషించే ఏఐ అసిస్టెంట్.

Notion AI: నోట్స్ రాసుకోవడానికి, వర్క్ స్పేస్‌లో కంటెంట్‌ను ఆర్గనైజ్ చేయడానికి స్మార్ట్ రైటింగ్ పార్ట్‌నర్.

కోడింగ్, వెబ్, యాప్ డెవలప్‌మెంట్

Lovable: కొన్ని నిమిషాల్లోనే ఆకట్టుకునే వెబ్ అప్లికేషన్లను బిల్డ్ చేసే టూల్.

Bolt new: ప్రాంప్ట్ ఆధారంగా ఫుల్-స్టాక్ వెబ్ యాప్‌లను నేరుగా రూపొందిస్తుంది.

Cursor: ప్రోగ్రామర్ల కోడింగ్ వేగాన్ని పెంచే ప్రముఖ ఏఐ కోడింగ్ అసిస్టెంట్.

Windsurf: ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను అందిస్తుంది.

Replit: బ్రౌజర్ నుంచే నేరుగా యాప్‌లను డెవలప్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి దోహదపడుతుంది.

Framer AI: కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా కోడింగ్ అవసరం లేకుండా వెబ్‌సైట్లను నిర్మిస్తుంది.

వీడియో మేకింగ్, ఎడిటింగ్

Kling AI: అత్యుత్తమ క్వాలిటీతో కూడిన ఏఐ వీడియోలను జనరేట్ చేస్తుంది.

CapCut: స్మార్ట్ ఏఐ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్‌ను సులభతరం చేసే ప్రజాదరణ పొందిన యాప్.

HeyGen: డిజిటల్ ఏఐ అవతార్లతో ప్రొఫెషనల్ వీడియోలను రూపొందిస్తుంది.

Synthesia: వర్చువల్ ప్రెజెంటర్లతో కంపెనీ విధానాలు, శిక్షణా వీడియోలను వేగంగా సిద్ధం చేస్తుంది.

Runway: అడ్వాన్స్డ్ ఏఐ జనరేటివ్ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్‌ టూల్.

Pika: కొన్ని క్లిక్‌లలో యానిమేషన్, సృజనాత్మక ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తుంది.

Luma AI: సినిమాటిక్ విజువల్స్, 3D మోషన్ వీడియోలను రూపొందిస్తుంది.

డిజైన్, ఇమేజ్ క్రియేషన్, గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్

PortfolioTab: నిమిషాల్లో ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియోలను డిజైన్ చేస్తుంది.

Canva: పోస్టర్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కోసం సులభమైన ఏఐ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్.

Midjourney: హై-క్వాలిటీ, హైపర్-రియలిస్టిక్ ఏఐ ఆర్ట్ క్రియేషన్‌కు తిరుగులేని టూల్.

Ideogram: చిత్రాలపై కచ్చితమైన టెక్స్ట్‌తో కూడిన ఏఐ ఇమేజెస్ రూపొందిస్తుంది.

Leonardo AI: గేమింగ్ అసెట్స్, కాన్సెప్ట్ ఆర్ట్‌లకు అనువైన డిజైన్ టూల్.

Figma AI: యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డిజైనర్ల ప్రొడక్టివిటీని పెంచే ఫీచర్లు.

Photoroom: ఈ-కామర్స్ ప్రొడక్ట్ ఫొటోలను ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేస్తుంది.

Remove bg: సింగిల్ క్లిక్‌తో చిత్రాల బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగిస్తుంది.

ఆడియో, వాయిస్, మ్యూజిక్

YouLearn: సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియోల నుంచి సారాంశాన్ని క్షణాల్లో అందిస్తుంది.

ElevenLabs: మన స్వరానికి చాలా దగ్గరగా ఉండే వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్-టు-స్పీచ్ సేవలు.

Podcastle: పోడ్‌కాస్ట్ రికార్డింగ్, ఆడియో ఎడిటింగ్‌ను సులభతరం చేస్తుంది.

Wispr Flow: వాయిస్ ద్వారా మాట్లాడిన మాటలను వెంటనే స్పష్టమైన టెక్స్ట్‌గా మారుస్తుంది.

Suno: టెక్స్ట్ డిస్క్రిప్షన్‌ ఆధారంగా అద్భుతమైన ఏఐ సంగీతాన్ని కంపోజ్ చేస్తుంది.

Udio: ఒరిజినల్ సాంగ్స్, మ్యూజిక్ ట్రాక్‌లను క్రియేట్ చేస్తుంది.

ఆటోమేషన్, వర్క్‌ఫ్లో

Tally: స్మార్ట్, డైనమిక్ ఆన్‌లైన్ ఫారమ్‌లను రూపొందించే సాధనం.

Zapier: వివిధ యాప్‌లను అనుసంధానించి రోజువారీ వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేస్తుంది.

Make: సంక్లిష్టమైన ఆటోమేషన్ ప్రాసెస్ వ్యాపారాలకు సులభం చేస్తుంది.

n8n: వినూత్నమైన ఓపెన్-సోర్స్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్.

మీటింగ్స్, ఆఫీస్ వర్క్

Gamma: కొన్ని నిమిషాల్లో ప్రెజెంటేషన్లు, డాక్యుమెంట్లను సిద్ధం చేస్తుంది.

Otter ai: జూమ్, గూగుల్ మీట్ వంటి సమావేశాలను రియల్-టైమ్‌లో టెక్స్ట్‌గా మారుస్తుంది.

Fireflies ai: మీటింగ్‌లకు సంబంధించిన నోట్స్, ముఖ్యాంశాలను స్వయంచాలకంగా రాస్తుంది.

Granola: ఆఫీస్ సమావేశాలలో ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో రికార్డ్ చేసే స్మార్ట్ అసిస్టెంట్.

అడ్వాన్స్‌డ్, ఆటోనమస్ ఏఐ ఏజెంట్లు

Tripo AI: ప్రాంప్ట్‌ల నుంచి సులభంగా 3D మోడళ్లను సిద్ధం చేస్తుంది.

The AI Library: రోజువారీ అవసరాలకు తగిన కొత్త ఏఐ టూల్స్‌ను కనుగొనడానికి ఉపయోగపడే డాష్‌బోర్డ్.

DeepL: వ్యాకరణ లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో విదేశీ భాషలను అనువదిస్తుంది.

Poe: ఒకే వేదికపై రకరకాల ప్రధాన ఏఐ మోడళ్లను వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

Genspark: స్వతంత్రంగా సమాచారాన్ని వెతికి నివేదికలు తయారుచేసే ఏఐ సూపర్ ఏజెంట్.

Manus: సంక్లిష్ట టాస్క్‌లను మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా పూర్తిచేసే ఆటోనమస్ ఏఐ ఏజెంట్.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం పనిచేసే విధానం కూడా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఏఐ సాధనాలను రోజువారీ వృత్తిపరమైన, వ్యాపార జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సమయం అవుతుంది. సృజనాత్మకత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement