ఇండిగో ఛార్జీల పెంపు | IndiGo Flight Ticket Price Hike Infant Charges Raised | Sakshi
Sakshi News home page

ఇండిగో ఛార్జీల పెంపు

Sep 18 2026 8:50 AM | Updated on Sep 18 2026 8:50 AM

IndiGo Flight Ticket Price Hike Infant Charges Raised

విమానయాన దిగ్గజం ఇండిగో వివిధ అనుబంధ సేవల ఛార్జీలను పెంచింది. దేశీ ఫ్లయిట్లలో ప్రయాణాలకు సంబంధించి మూడు రోజుల నుంచి రెండేళ్ల లోపు వయస్సు గల పిల్లలకు ఛార్జీలను రూ.2,200 నుంచి రూ.3,000కు పెంచింది. అంతర్జాతీయ రూట్లలో ఈ ఛార్జీలు వేరుగా ఉంటాయి.

ఇక పెద్దవాళ్లు వెంట లేకుండా ఒంటరిగా ప్రయాణించే మైనర్లకు సంబంధించిన ఛార్జీలు దేశీ ఫ్లయిట్స్‌లో రూ.5,999గా, అంతర్జాతీయ ఫ్లయిట్స్‌లో రూ.12,999గా ఉంటుందని తమ వెబ్‌సైట్‌లో కంపెనీ పేర్కొంది. అయితే, గతంలో ఈ రేట్లు ఎంత ఉండేవనేది నిర్దిష్టంగా తెలియరాలేదు. మరోవైపు ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ సర్వీస్‌ ఛార్జీలు రూ.650గా, ట్రావెల్‌ సర్టిఫికెట్‌ రేటు రూ.300గా ఉంటుందని వెబ్‌సైట్‌లో కంపెనీ పేర్కొంది. ఇంధన ధరల కారణంగా నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో కొన్ని అనుబంధ సేవల చార్జీలను కంపెనీ పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement