వ్యాయామం చేస్తే డబ్బులు.. ఉద్యోగులకు కంపెనీ అదిరే ఆఫర్‌! | South Korea Company Rewards Employees For Regular Exercise | Sakshi
Sakshi News home page

వ్యాయామం చేస్తే డబ్బులు.. ఉద్యోగులకు కంపెనీ అదిరే ఆఫర్‌!

Sep 19 2026 11:47 AM | Updated on Sep 19 2026 11:50 AM

South Korea Company Rewards Employees For Regular Exercise

లైఫ్‌

హెల్త్‌

జీతం కోసం ఉద్యోగం.. ఆరోగ్యం కోసం వ్యాయామం.. రెండింటికీ ఒకేసారి ప్రోత్సాహం లభిస్తే? ఇదే ఇప్పుడు ఆఫీస్‌ వెల్‌నెస్‌ ట్రెండ్‌గా మారుతోంది. ఆఫీసుకు వెళ్లడం.. పని చేయడం.. ఇంటికి రావడం.. ఇదే ఉద్యోగుల రోజువారీ రొటీన్‌.

కానీ ఈ రొటీన్‌ లో వ్యాయామానికీ చోటు కల్పిస్తే? పైగా అందుకు కంపెనీనే రివార్డ్‌ ఇస్తే? దక్షిణ కొరియాలో ఓ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు అలాంటి కార్యక్రమాన్నే చేపట్టడంతో ఆసక్తికరంగా మారింది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఉద్యోగులను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో ఉద్యోగులు నిర్దిష్ట కాలం పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

అంటే రెండు నెలల పాటు క్రమశిక్షణగా కొనసాగించిన వారికి రివార్డ్‌ అందించడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ భారతీయ ఉద్యోగి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: కేరళలో వృద్ధులే అధికం.. కుటుంబాలకు కొత్త సవాల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement