breaking news
Freshness
-
సూపర్మార్కెట్లో కూరగాయలపై నీళ్లు ఎందుకు చల్లుతారో తెలుసా?
నీళ్లు చల్లడమెందుకు..సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు కూరగాయలు, ఆకుకూరలపై నీటి తుంపర్లు కనిపిస్తుంటాయి. అవి తాజాగా కనిపించేందుకు మాత్రమే ఇలా చేస్తున్నారని అనుకుంటాం. కానీ దీని వెనుక మరో కారణం కూడా ఉంది. కూరగాయలు కోసిన తర్వాత సమయం గడిచేకొద్దీ వాటిలోని నీరు ఆవిరైపోతుంది.దాంతో ఆకుకూరలు, కొన్ని కూరగాయలు వాడిపోయినట్లు కనిపిస్తాయి. వాటిపై కొద్దిగా నీటిని చల్లడం వల్ల అవి తేమను కోల్పోకుండా చేసి, తాజాగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయవచ్చు. అయితే నీళ్లు చల్లినంత మాత్రాన కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని కాదు. అధిక తేమ, సరైన నిల్వ లేకపోవడం వల్ల కొన్ని కూరగాయలు త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కూరగాయలు కొనేటప్పుడు కేవలం మెరుపు, తేమ చూసి కాకుండా రంగు, వాసన, గట్టితనం, తాజాదనం కూడా గమనించడం మంచిది.ఇవీ చదవండి: వ్యాయామం చేస్తే డబ్బులు.. ఉద్యోగులకు కంపెనీ అదిరే ఆఫర్! -
తాజాదనం కోసం..!
ప్రపంచానికి ఇప్పుడు జనాభా కన్నా పెద్ద సమస్య ‘ఆహారవృథా’. ఆహారాన్ని సరిగా నిల్వ చేసే అవకాశం లేకపోవడం కూడా ఈ సమస్యకు మూలం. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ‘ఫుడ్ హగ్గర్స్’ను రూపొందించారు కొందరు నిపుణులు. పండ్లకైనా, కూరగాయలకైనా చెడిపోకుండా వాటి పై తోలు ఎంత రక్షణను ఇస్తుందో ఇది కూడా అంతే రక్షణను ఇస్తుందట! నవనవలాడుతున్న కూరగాయలనైనా, తాజా పండ్లనైనా ఈ హగ్గర్స్లో దాచి ఉంచితే చాలు. వారాలు గడిచినా అవి అంతే తాజాగా ఉంటాయట. సగం తిన్న పండునైనా ఈ హగ్గర్స్తో దాచవచ్చు. పండ్లను లేదా కూరగాయలను ఉంచిన హగ్గర్స్ను ఫ్రిడ్జ్‌లో కూడా ఉంచవచ్చు. దీనివల్ల దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. ఈ హగ్గర్స్ను సిలికాన్‌తో రూపొందించామని వీటి రూపకర్తలైన మైఖేల్ ఇవన్కోవిక్, అడ్రినే మెక్నికోలస్లు తెలిపారు. ప్రత్యేకించి అమెరికన్లు వృథా చేస్తున్న ఆహార పరిణామాన్ని తగ్గించడానికే వీటిని రూపొందించామని వారు వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని నిల్వ ఉంచడానికి అల్యూమినియం పాత్రలను, ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సిలికాన్ హగ్గర్లు ఉపయోగపడతాయన్నారు. తిరిగి వాడటానికి అనుకూలంగా ఉండే ఈ హగ్గర్స్ ధర మాత్రం కాస్త ఎక్కువే. నాలుగు ఉల్లిపాయలు లేదా టొమాటోలను నిల్వ ఉంచడానికి ఉపయోగపడే హగ్గర్ విలువ 15 డాలర్లు. ప్రస్తుతం వీటి తయారీ కిక్‌స్టార్టర్ దశలోనే ఉంది.


