తాజాదనం కోసం..! | For freshness ..! | Sakshi
Sakshi News home page

తాజాదనం కోసం..!

Jul 3 2014 11:24 PM | Updated on Oct 4 2018 5:08 PM

తాజాదనం కోసం..! - Sakshi

తాజాదనం కోసం..!

ప్రపంచానికి ఇప్పుడు జనాభా కన్నా పెద్ద సమస్య ‘ఆహారవృథా’. ఆహారాన్ని సరిగా నిల్వ చేసే అవకాశం లేకపోవడం కూడా ఈ సమస్యకు మూలం.

ప్రపంచానికి ఇప్పుడు జనాభా కన్నా పెద్ద సమస్య ‘ఆహారవృథా’. ఆహారాన్ని సరిగా నిల్వ చేసే అవకాశం లేకపోవడం కూడా ఈ సమస్యకు మూలం. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ‘ఫుడ్ హగ్గర్స్’ను రూపొందించారు కొందరు నిపుణులు. పండ్లకైనా, కూరగాయలకైనా చెడిపోకుండా వాటి పై తోలు  ఎంత రక్షణను ఇస్తుందో ఇది కూడా అంతే రక్షణను ఇస్తుందట!

నవనవలాడుతున్న కూరగాయలనైనా, తాజా పండ్లనైనా ఈ హగ్గర్స్‌లో దాచి ఉంచితే చాలు. వారాలు గడిచినా అవి అంతే తాజాగా ఉంటాయట. సగం తిన్న పండునైనా ఈ హగ్గర్స్‌తో దాచవచ్చు. పండ్లను లేదా కూరగాయలను ఉంచిన హగ్గర్స్‌ను ఫ్రిడ్జ్‌లో కూడా ఉంచవచ్చు. దీనివల్ల దీర్ఘకాలం నిల్వ ఉంటాయి.
 
ఈ హగ్గర్స్‌ను సిలికాన్‌తో రూపొందించామని వీటి రూపకర్తలైన మైఖేల్ ఇవన్‌కోవిక్, అడ్రినే మెక్‌నికోలస్‌లు తెలిపారు. ప్రత్యేకించి అమెరికన్‌లు వృథా చేస్తున్న ఆహార పరిణామాన్ని తగ్గించడానికే వీటిని రూపొందించామని వారు వివరించారు.
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని నిల్వ ఉంచడానికి అల్యూమినియం పాత్రలను, ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సిలికాన్ హగ్గర్‌లు ఉపయోగపడతాయన్నారు. తిరిగి వాడటానికి అనుకూలంగా ఉండే ఈ హగ్గర్స్ ధర మాత్రం కాస్త ఎక్కువే. నాలుగు ఉల్లిపాయలు లేదా టొమాటోలను నిల్వ ఉంచడానికి ఉపయోగపడే హగ్గర్ విలువ 15 డాలర్లు. ప్రస్తుతం వీటి తయారీ కిక్‌స్టార్టర్ దశలోనే ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement