ఎక్స్‌పైరీ డేట్‌ వర్సెస్‌ బెస్ట్‌ బిఫోర్‌ | Whats the Difference Between Best Before and Expiry Dates | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పైరీ డేట్‌ వర్సెస్‌ బెస్ట్‌ బిఫోర్‌

Oct 29 2026 5:07 PM | Updated on Oct 29 2026 5:31 PM

Whats the Difference Between Best Before and Expiry Dates

సూపర్‌ మార్కెట్‌లో పాలు, బిస్కెట్లు, బ్రెడ్, వంట నూనె లేదా ఇతర ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు కొనేటప్పుడు ధర, బరువు, ఆఫర్లను చూస్తాం. కానీ ప్యాకెట్‌పై ఉండే తేదీలను చాలామంది పట్టించుకోరు. ఎక్స్‌పైరీ డేట్, బెస్ట్‌ బిఫోర్‌ అనేవి రెండూ ఒకటే కావని గుర్తించాలి. 

ఎక్స్‌పైరీ డేట్‌: ఆహారాన్ని సురక్షితంగా వినియోగించడానికి గడువును సూచించేదే ఎక్స్‌పైరీ డేట్‌. ఈ డేట్‌ దాటిన తర్వాత ఆహారాన్ని తినకూడదు. చూడటానికి, వాసనకు, స్పర్శకు సాధారణంగానే ఉన్నా హానికరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చు. ప్యాకెట్‌ తెరిచిన తర్వాత ఎన్ని రోజుల్లో వినియోగించాలో తెలిపే సూచనలను కూడా పాటించాలి.

బెస్ట్‌ బిఫోర్‌: ఇది ఆహారం అత్యుత్తమ నాణ్యతతో ఉండే కాలాన్ని సూచిస్తుంది. ఆ తేదీ వరకు రుచి, రూపం, సువాసన సాధారణంగా మెరుగ్గా ఉంటాయి. ఆ తేదీ దాటగానే ఆహారం పాడైపోతుందని కాదు. అయితే రుచి, కరకరలాడే లక్షణం తగ్గవచ్చు. రంగు లేదా వాసన మారితే ఆహారాన్ని పారేయాలి.

కొనేటప్పుడు జాగ్రత్తలు
తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్, బెస్ట్‌ బిఫోర్, ప్యాకెట్‌ పరిస్థితి, నిల్వ సూచనలు పరిశీలించాలి. చిరిగినా, లీకవుతున్నా, ఉబ్బినా లేదా సీల్‌ దెబ్బతిన్నట్లు కనిపించినా అవి కొనక΄ోవడమే మేలు. తగ్గింపు ధరకు వస్తున్నాయని మాత్రమే చూసి పాత వస్తువులు కొనుగోలు చేయకూడదు. ΄పాలు, పెరుగు, బ్రెడ్, మాంసం, చేపలు, బేబీ ఫుడ్‌ వంటి వాటి విషయంలో మరింత జాగ్రత్త ఉంటే రోగాల బారిన పడనట్టే... 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement